Breaking: చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ముగ్గురి మహిళల మృతి

గుంటూరు చంద్రబాబు సభలో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి.

Update: 2023-01-01 13:48 GMT

గుంటూరు చంద్రబాబు సభలో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన మహిళలను వెంటనే పోలీసులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చంద్రన్న తోఫా, సంక్రాంతి కానుకల పంపిణీ జరిగింది. చంద్రబాబు సభలో మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత తోపులాట జరిగింది. పెద్ద గ్రౌండ్ లో ఏర్పాటు చేసినా చివరకు తొక్కిసలాట జరిగి కార్యక్రమం రసాభాసగా ముగిసింది. తొక్కిసలాటలో  ముగ్గురు మహిళలు  మృతి చెందారు. 

ఎన్ఆర్ఐల సహకారంతో...
నూతన సంవత్సరం రోజున చంద్రన్న కానుకలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. జనతా వస్త్రాలతో పాటు నిత్యావసర వస్తువుల పంపిణీని టీడీపీ చేపట్టింది. ఎన్ఆర్ఐ విభాగం ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది. చంద్రబాబు కొందరికి పంపిణీ చేసి వెళ్లిపోయిన తర్వాత పదిహేను లారీల్లో ఈ వస్తువులను ఉంచి పంపిణీని ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలపాలయ్యారని తెలిసింది. వాలంటీర్లు, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ తొక్కిసలాట జరిగింది. దీంతో నిర్వాహకులు పంపిణీ కార్యక్రమాన్ని నిలిపేశారు.


Tags:    

Similar News