తిరుమలలో కన్పించని భక్తులు

తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కేవలం రెండు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు

Update: 2022-09-26 02:53 GMT

తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కేవలం రెండు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనం కోసం కేవలం రెండు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నవరాత్రులు ప్రారంభం రోజు కావడంతో భక్తుల సంఖ్య తక్కువగా ఉందని చెబుతున్నారు.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 69,650 మంది భక్తులు దర్శించుకున్నాు. 20,409 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.51 కోట్ల రూపాయలు అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు.


Tags:    

Similar News