తిరుమల దర్శనం ఈరోజు అంత సులువు కాదు
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. దర్శనానికి భక్తుల సమయం ఎక్కువ పడుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. దర్శనానికి భక్తుల సమయం ఎక్కువ పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తుల దర్శనానికి ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇప్పుడు క్యూలైన్ లో వచ్చిన వారికి మరో నాలుగు, ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను పొందిన వారికి శ్రీవారిని దర్శించుకోవాలంటే రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,263 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,965 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 4.53 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.