తిరుమల వచ్చే వారికి సూచన

తిరుమలలో భక్తులు రద్దీ తగ్గడం లేదు. కొవైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Update: 2022-10-19 02:47 GMT

తిరుమలలో భక్తులు రద్దీ తగ్గడం లేదు. కొనసాగుతూనే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్ లో ఉన్న వారికి ఈ సమయం వర్తిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. కొత్తగా క్యూ లైన్ లోకి వచ్చే వారికి ఈ సమయం కంటే అధిక సమయం పట్టే అవకాశముంది.

రద్దీ ఎలా ఉందంటే?
300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల దర్శన సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 73,420 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,621 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.28 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News