మద్యం స్కాం కేసులో నేడు ఈడీ విచారణ?

ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాం కేసులో నేడు ఈడీ విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది.

Update: 2025-05-28 04:18 GMT

ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాం కేసులో నేడు ఈడీ విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. నేడు రాజ్ కెసిరెడ్డి వాంగ్మూలం నమోదు చేయనుందని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డిని ఈడీ అధికారులు విచారించే అవకాశముంది. వాంగ్మూలం నమోదుకు అనుమతి కోరుతూ గతంలో ఈడీ హైకోర్టులో పిటిషన్ వేసింది.

రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం...
వాంగ్మూలం నమోదుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. విజయవాడ జిల్లా జైలులో రాజ్ కెసిరెడ్డి నుంచి వాంగ్మూలం ఈడీ అధికారులు తీసుకోనున్నారని తెలిసింది. మద్యం కుంభకోణంలో వేల కోట్లు అక్రమంగా మనీలాండరింగ్ జరిగినట్లు సిట్ నిర్ధారించడంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టననున్నారు.


Tags:    

Similar News