కోటి విరాళం ఇచ్చిన మహిళ
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ట్రస్టులకు ఓ భక్తురాలు భారీ విరాళం అందజేశారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ట్రస్టులకు ఓ భక్తురాలు భారీ విరాళం అందజేశారు. చెన్నైలోని ఈరోడ్‌కు చెందిన సౌమ్య అనే భక్తురాలు ఏకంగా కోటి రూపాయలు విరాళం ప్రకటించి తన భక్తిని చాటుకున్నారు. ఆమె విరాళానికి సంబంధించిన చెక్కును టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. రెండు ట్రస్టులకు డబ్బును సమానంగా విభజించి ఇచ్చారు. శ్రీవారి నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు 50 లక్షలు, ప్రాణదానం ట్రస్టుకు మరో 50 లక్షల రూపాయల చొప్పున విరాళంగా అందించారు. టీటీడీ తరఫున అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. శాలువాతో సత్కరించారు.