కార్గో క్యాబిన్‌లో పడుకున్న రెండో డ్రైవర్
కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై చేస్తున్న విచారణలో వి.కావేరీ ట్రావెల్ బస్సు మంటల్లో చిక్కుకున్న సమయంలో రెండో డ్రైవర్ శివనారాయణ
కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై చేస్తున్న విచారణలో వి.కావేరీ ట్రావెల్ బస్సు మంటల్లో చిక్కుకున్న సమయంలో రెండో డ్రైవర్ శివనారాయణ బస్సు కింది భాగంలోని కార్గో క్యాబిన్‌లో నిద్రిస్తున్నట్లు తెలిసింది. ప్రమాద సమయంలో తాను కార్గో క్యాబిన్‌లో గాఢనిద్రలో ఉన్నట్లు, భారీ శబ్దం రావడంతో మెలుకువ వచ్చినట్లు శివనారాయణ చెప్పాడు. ముందుభాగంలో మంటలు చెలరేగిన సమయంలో కంగారుగా డ్రైవర్ లక్ష్యయ్య తన వద్దకు వచ్చినట్లు తెలిపాడు. తామిద్దరూ ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదని, బస్సు కుడివైపు అద్దాలు పగులకొట్టి కొంతమంది ప్రయాణికులను బయటకు లాగామని వెల్లడించాడు. ఇతరులతో కలసి తాము చేసిన ప్రయత్నం వల్లే 27 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారన్నాడు శివనారాయణ.