తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత

తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటా పోటీ కార్యక్రమాలను నిర్వహించడానికి పిలుపు నిచ్చారు

Update: 2025-11-12 04:11 GMT

తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటా పోటీ కార్యక్రమాలను నిర్వహించడానికి పిలుపు నిచ్చారు. వైసీపీ మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీని నిర్వహిస్తుంది. ఈ మేరకు వైసీపీ నేతలు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే ఇదే సమయంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

పోటా పోటీ కార్యక్రమాలతో...
ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అనుమతించలేదు. యాడికి వెళ్లి అక్కడ నిరసన చేయాలనుకున్నప్పటికీ అందుకు కూడా అనుమతించలేదు. దీంతో పెద్దారెడ్డి నిరసనకు దిగారు.యాడికి మండలం వెళ్లకుండా తనకు అనుమతి ఇచ్చిన పోలీసులు అడ్డుకోవడం ఏంటని పెద్దారెడ్డి ప్రశ్నిస్తున్నారు. పోటాపోటీ కార్యక్రమాలతో తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది.


Tags:    

Similar News