Tadipathri : తాడిపత్రిలో టెన్షన్.. టీడీపీలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ

తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది. వినాయక నిమజ్జనంలో టీడీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది

Update: 2025-08-31 11:21 GMT

తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది. వినాయక నిమజ్జనంలో టీడీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గణేశుడి శోభాయాత్రలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల వర్గీయులు ఎదురుపడటంతో ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పోటాపోటీ నినాదాలతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో తాడిపత్రి నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

వినాయక నిమజ్జనం సందర్భంగా...
జేసీ ప్రభాకర్రెడ్డి, కాకర్ల వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పలు వాహనాలు ధ్వంసం, భారీగా పోలీసుల మోహరించారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. రెండు వర్గాల్లో ముఖ్యులను అదుపులోకి తీసుకుని వదిలేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా తలెత్తిన ఈ ఘర్షణతో తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.


Tags:    

Similar News