Srikakulam Stampades : కాశీబుగ్గ మృతులు వీరే
శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 10మంది మరణించారు
శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 10మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శనివారం, కార్తీమాసం, ఏకాదశి కావడంతో ఈరోజు వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మంచిదని అందరూ భావిస్తారు. మృతుల వివరాలు కొన్ని తెలుస్తున్నాయి. జిల్లాలోని ఉన్నతాధికారులందరూ ఆలయం వద్దకు చేరుకున్నారు. పిల్లలతో సహా 10 మంది మరణించారని తెలిసింది. మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నారు.
దుక్కవానిపాటికి చెందిన మురిపింటి నేలమ్మ
బెల్లిపటాయకు చెందిన దువ్వు రాజేశ్వరి
శివరాంపురానికి చెందని యశోదమ్మ
టెక్కికి రాపాక విజయ