Vangaveeti : వంగవీటి రాధాకు గుండెనొప్పి.. ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు
vangaveeti radha
తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు యాంజిగ్రామ్ చేసిన అనంతరం స్టంట్ వేశారు. వంగవీటి రాధా ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తతం రాధా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నిలకడగానే ఉందని...
వంగవీటి అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్దిగా ఛాతీనొప్పి రావడంతో ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించడంతోనే ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. వంగవీటి రాధాకు చిన్న వయసులో గుండెనొప్పి రావడం ఏంటని వంగవీటి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.