నేడు బాబు రెండు చోట్ల బహిరంగ సభలు

నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు

Update: 2022-10-19 02:58 GMT

నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను చంద్రబాబు పరామర్శించనున్నారు. చిలకలూరిపేట, గురజాల నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది. తొలుత ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చేరుకుని అక్క నష్టపోయిన రైతులను చంద్రబాబు పరామర్శించనున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో...
అనంతరం నాదెండ్ల గ్రామానికి చేరుకుని దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. అనంతరం తూబాడు గ్రామం చేరుకుని పొలాలను పరిశీలించి పంట నష్టపోయిన రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. తర్వాత నరసరావుపేట, గురజాల చేరుకుని పంట పొలాలలను పరిశీలించి నష్టపోయిన రైతులతో మాట్లాడతారు. గురజాలలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. చంద్రబాబు పర్యటనకు పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.


Tags:    

Similar News