Chandrababu : నేడు అయోధ్యకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అయోధ్యకు వెళతారు

Update: 2025-12-28 03:07 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అయోధ్యకు వెళతారు. అయోధ్య బాలరాముడిని ఈరోజు చంద్రబాబు నాయుడు దర్శించుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు అయోధ్య చేరుకుంటారు. అయోధ్య బాలరాముడిని సందర్శించి పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి విజయవాడ కు చేరుకుంటారు.

ఈ నెల 30న యూరప్ కు...
రేపు మంత్రి వర్గ సమావేశంలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలసి ఈ నెల 30వ తేదీన యూరప్ పర్యటనకు బయలు దేరి వెళ్లనున్నారు. కొత్త సంవత్సరం వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ లో నిర్వహించుకోనున్నారు. తిరిగి వచ్చే నెల మొదటి వారంలో తిరిగి రానున్నారు.


Tags:    

Similar News