దుర్గగుడిలో విద్యుత్తు సరఫరా నిలిపివేత
విజయవాడలో దుర్గగుడికి విద్యుత్ సరఫరా ను అధికారులు నిలిపివేశారు
విజయవాడలో దుర్గగుడికి విద్యుత్ సరఫరా ను అధికారులు నిలిపివేశారు. విద్యుత్త్ శాఖకు రూ.3.08 కోట్ల బిల్లు బకాయిలున్నాయంటూ విద్యుత్తు శాఖ ఈ చర్యలు తీసుకుంది. 2023 ఫిబ్రవరి నుంచి బిల్లు చెల్లించలేదని అందుకే విద్యుత్తును తొలగించినట్లు విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశార. బకాయిల కోసం నోటీసులు ఇచ్చినా స్పందన లేదని అధికారులు తెలిపారు. హెచ్‌టీ లైన్ నుంచి విద్యుత్‌శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశార.
బిల్లుల బకాయీలు ఉండటంతో...
భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలిన దేవస్థానం కోరింది. విద్యుత్ సేవలకు అంతరాయం లేకుండా జనరేటర్ సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. తమ సోలార్ ప్లాంట్ నుంచి విద్యుత్ దేవస్థానం ఇస్తున్నామని చెబుతునా్నర. విద్యుత్‌శాఖను నెట్ మీటరింగ్ కోసం పలుమార్లు దేవస్థానం కోరినప్పటికీ ఉత్పత్తి అవుతోన్న విద్యుత్‌ను సాంకేతిక కారణాలతో విద్యుత్తు శాఖ అధికారుల నమోదు చేయలేదు. విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని నిన్న సాయంత్రమే దుర్గగుడి ఈవోకు సమాచారం ఇచ్చామని తెలిపారు.