నేడు జగ్గయ్యపేటకు చంద్రబాబు

నేడు జగ్గయ్యపేటకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రానున్నారు

Update: 2022-11-04 06:54 GMT

ChandrababuNaidu

నేడు జగ్గయ్యపేటకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రానున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. చంద్రబాబు పర్యటన కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చంద్రబాబు రాక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కొందరు చించి వేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

వైసీపీ కార్యకర్తల పనే...
ఇది వైసీపీ కార్యకర్తల పనేనని టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఆరోపించారు. ఇటువంటి దిగజారుడు పనులకు పాల్పడుతూ అరాచకాలకు అడ్రస్ గా మార్చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News