జగన్ మాఫియా పెరిగిపోయింది

ముఖ్యమంత్రి జగన్ ఇంటికో సైకోను తయారు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు

Update: 2022-08-26 11:57 GMT

ముఖ్యమంత్రి జగన్ ఇంటికో సైకోను తయారు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇసుక, మద్యం, మైనింగ్ ల ద్వారా వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో పెరిగిపోయిందన్నారు. కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు పర్యటన సందర్భంగా ఆయన ప్రసంగించారు. వైసీపీ నేతలు ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారని ఆయన మండి పడ్డారు.

తండ్రిని అడ్డంపెట్టుకుని...
తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డంపెట్టుకుని లక్షల కోట్లను దోచుకున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం జరుగుతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు సివిల్ డ్రస్సులో వైసీపీ కార్యకర్తల్లా మారి గూండాల్లా వ్యవహరిస్తున్నారన్నారు. వారిపై ప్రయివేటు కేసులు వేస్తామని హెచ్చరించారు. తాము అధికారంలోకి రాగానే అటువంటి అధికారుల పనిపడతామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం కోతల, రోతల ప్రభుత్వమని చంద్రబాబు దుయ్యబట్టారు


Tags:    

Similar News