Chandrababu : నేడు ఢిల్లీకి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు
chandrababu naidu
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ పెద్దలను కలవనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి పిలవడంతో ఆయన ఈరోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు, రేపు పార్టీ పెద్దలతో సమవేశం కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాత్రికి అమిత్ షాతో...
ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళతారు. ఈరోజు రాత్రికి అమిత్ షాను కలిసే అవకాశం ఉందని తెలిసింది. రేపు కూడా ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా సమావేశం కానున్నారు. రానున్న ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశాలపై చర్చించే అవకాశముంది.