సంక్షేమాన్ని ఆపను... నన్ను నమ్మండి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదోనిలో రోడ్ షోలో పాల్గొన్నారు

Update: 2022-11-17 12:43 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదోనిలో రోడ్ షోలో పాల్గొన్నారు. తాను అధికారంలోకి వస్తే సంక్షేమాన్ని ఆపనని తెలిపారు. సంక్షేమాన్ని ఆపుతానని కొందరు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తాను ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే పింఛను మూడు వేలు అయి ఉండేదని ఆయన అన్నారు. తాను సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తానని ఆయన తెలిపారు.

ఒక చేత్తో ఇచ్చి....
జగన్ రెడ్డి పాలనలో దోపిడీ పెరిగిపోయిందన్నారు. నాడు ముద్దులకు మోసపోయి ఓట్లు వేసి నష్టపోయామని, మరోసారి అలాంటి పొరపాట్లు చేయవద్దని సూచించారు. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో రావడం లేదన్నారు. ధరలు పెరిగిపోయాయని అన్నారు. పేదలకు అమలుపర్చే సంక్షేమ పథకాలను ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో లాక్కుంటున్నాడని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇక్కడ ఉన్న ఇసుక హైదరాబాద్, బెంగళూరులో లభ్యమవుతుందన్నారు. సిండికేట్ల చేతిలో సామ్రాజ్యాలను నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లాలో హవాలా మంత్రి, కర్నూలులో బెంజి మంత్రి ఉన్నారని ఎద్దేవా చేశారు.


Tags:    

Similar News