టెక్ కంపెనీ సీఈవోలతో చంద్రబాబే భేటీ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో టెక్ కంపెనీల సీఈఓలు భేటీ అయ్యారు
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో టెక్ కంపెనీల సీఈఓలు భేటీ అయ్యారు. వివిధ కంపెనీల సీఈవోలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. ఈరోజు ఉదయం జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొని పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు.
వరస భేటీలతో...
ఆడోబ్ సీఈఓ శాంతనూ నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే, ఆరామ్కో ఇండియా డైరెక్టర్ అబ్దుల్ రెహ్మాన్ ఐతుకైర్ తో సీఎం సమావేశం అయ్యారు.లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్ ఆధార్ ఫౌండర్ సీటీఓ శ్రీకాంత్ నాదముని, కాలిఫోర్నియాకు చెందిన ఖోస్లా వెంచర్స్ ఎండీ వినోద్ ఖోస్లాతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించి పెట్టుబడులు ఏపీలో పెట్టాలని కోరారు.