రెండు లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం సాధ్యమేనా?

ఆచ‌ర‌ణ సాధ్యం కాని అమ‌రావ‌తి క‌న్నా మావిగ‌న్ తో సులువైన అభివృద్ధి జరుగుతుందని వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు

Update: 2026-04-06 11:57 GMT

ఆచ‌ర‌ణ సాధ్యం కాని అమ‌రావ‌తి క‌న్నా మావిగ‌న్ తో సులువైన అభివృద్ధి జరుగుతుందని వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిలో మౌలిక స‌దుపాయాల‌కే రూ.2 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేయ‌డం సాధ్యం కాని ప‌ని అని అన్నారు. ఆచ‌ర‌ణ సాధ్యం కాని అమ‌రావ‌తి క‌న్నా మావిగ‌న్ సులువైన అభివృద్ధి మంత్రమని, కేవలం .20 వేల కోట్ల‌తో వేగంగా పూర్తి చేయొచ్చని తెలిపారు.

మావిగన్ గ్రోత్ ఇంజిన్....
మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు కారిడార్ తో కూడిన మావిగ‌న్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అవుతుందన్న రాచమల్లు మావిగ‌న్ పై ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన స్పంద‌న చూసి చంద్ర‌బాబులో వ‌ణుకుపుడుతోందన్నారు. చంద్ర‌బాబు రూ. కోట్లు ఖ‌ర్చు చేసి మావిగ‌న్‌పై సోష‌ల్ మీడియాలో పెయిడ్ ట్రోలింగ్ చేయిస్తున్నాడని, మావిగ‌న్ పేరుతో నీచాతి నీచంగా వైయ‌స్ జ‌గ‌న్ గారిపై వ్య‌క్తిగ‌త దాడి చేయిస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. మావిగ‌న్ పై చంద్ర‌బాబు కుట్ర రాజ‌కీయాలు వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ మొద‌లుపెట్టారని అన్నారు.


Tags:    

Similar News