Tirumala : తిరుమల హుండీలో 400 కోట్ల పాత నోట్లు
తిరుమల హుండీలో 400 కోట్ల పాత నోట్లు కనిపించాయి
తిరుమల హుండీలో 400 కోట్ల పాత నోట్లు కనిపించాయి. తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను భక్తులు ఇంకా శ్రీవారి హుండీలో వేస్తున్నారు. హుండీ లెక్కింపు సమయంలో దాదాపు నాలు వందల కోట్ల విలువైన రద్దయిన నోట్లు బయటపడ్డాయి.
400 కోట్ల విలువైన...
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద సుమారు రూ.400 కోట్ల విలువైన పాత నోట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం లేదా ఆర్బీఐ వీటి మార్పిడికి అనుమతి నిరాకరించడంతో ఈ భారీ మొత్తం నిరుపయోగంగా మారింది. మరోవైపు 2000 నోట్లను మాత్రం బ్యాంకులు స్వీకరిస్తున్నాయి. భక్తుల కానుకలను వృధా పోనివ్వకుండా కేంద్రం తక్షణమే స్పందించాలని టీటీడీ కోరుతుంది.