నేడు చిత్తూరు,తిరుపతిలో మంత్రి నారాయణ

నేడు చిత్తూరు,తిరుపతిలో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది

Update: 2026-04-06 04:02 GMT

నేడు చిత్తూరు,తిరుపతిలో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో క్షేత్ర స్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. చిత్తూరు కార్పొరేషన్,చుడా అధికారులతో మంత్రి సమీక్ష చేయనున్నారు.

అధికారులతో సమీక్షలు...
మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో క్షేత్ర స్థాయిలో మంత్రి నారాయణ పర్యటించనున్నారు. తుడా అధికారులు,కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష చేయనున్నారు. రాత్రి 7 గంటలకు విజయవాడ మంత్రి నారాయణ చేరుకోనున్నారు.


Tags:    

Similar News