Pawan kalyan : నేడు తమిళనాడుకు పవన్

పవన్ కల్యాణ్ నేడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు

Update: 2026-04-06 04:07 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తమిళనాడులోని తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారు.నేడు తమిళనాడులో ఏపీ డిప్యూటీ సీఎం ఎన్నికల ప్రచారం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

బీజేపీ అభ్యర్థికి మద్దతుగా...
తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాంధీకి మద్దతుగా ప్రచారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేయనున్నారు. పవన్ కల్యాణ్ ప్రచారం వల్ల తెలుగు వారి ఓట్లు వస్తాయని పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాలతో పవన్ తమిళనాడుకు ప్రత్యేకంగా ప్రచారానికి వెళుతున్నారు.


Tags:    

Similar News