Chandrababu : జగన్ రెడ్డికి పిచ్చ ముదిరింది : చంద్రబాబు
రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో యాడికిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని తెలిపారు. రాయలసీమలో ప్రతి ఒక్క ఎకరానికి సాగు నీరు అందించడమే తమ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని జలాశయాలన్నీజలకళను సంతరించుకున్నాయి.
గోదావరి పుష్కరాలకు ముందే...
గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నీరు అందిస్తామని చెప్పారు. ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి అని చంద్రబాబు అన్నారు. అమరావతి పేరు పలకడం ఇష్టంలేని జగన్ రెడ్డి మావిగన్ అని కొత్త నినాదాన్ని అందుకున్నాడని, ఆయనకు పిచ్చ మరింత ముదిరిందని చంద్రబాబు అన్నారు. రాయలసీమలో తిరుపతి, ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, కోస్తాంధ్రలో అమరావతిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.