Andhra Pradesh : ఏపీలో కొనసాగుతున్న ఎన్టీఆర్ వైద్య సేవల బంద్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవల బంద్ కొనసాగుతుంది
ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవల బంద్ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవల బంద్ కొనసాగుతుండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేస్తామని చెప్పిందని, కానీ దానిపై ఇంత వరకూ ఉత్తర్వులు విడుదల చేయలేదని ఆసుపత్రుల యాజమాన్యం తెలిపింది.
సాయంత్రానికి ఉత్తర్వులు రాకుంటే...
మొత్తం మూడు వేల కోట్ల రూపాయల వరకూ బకాయీలు చెల్లించాల్సి రావడంతో గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అయ్యాయి. అయితే ప్రభుత్వం నుంచి ఈ సాయంత్రానికి వెయ్యి కోట్ల రూపాయలు నిధుల విడుదలకు సంబంధించి ఉత్తర్వులు రాకపోతే కార్పొరేట్ ఆసుపత్రులతో కలసి బంద్ ను మరింత ఉధృతం చేస్తామని ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది.