జగన్ పై నారా లోకేష్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు.

Update: 2021-11-26 05:53 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. పేదలకు ఇచ్చే పక్కా ఇళ్ల నుంచి కోట్ల రూపాయలు కమీషన్లు కొట్టేస్తున్నారని విమర్శించారు. పక్కా ఇళ్లకు రిజిస్ట్రేషన్లు అంటూ పదిహేను వందల కోట్లకు జగన్ స్కెచ్ వేశారని నారా లోకేష్ ఆరోపించారు.

మేం వస్తే ఉచితమే...
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పక్కా ఇళ్లను పేదలకు ఉచితంగా ఇస్తున్నా జగన్ రెడ్డి ప్రభుత్వం అప్పటి నుంచి ఇచ్చిన ఇళ్లకు రిజిస్ట్రేషన్లంటూ వసూళ్లు కార్యక్రమం మొదలుపెట్టిందన్నారరు. పక్కా ఇళ్లకు ఎవరూ రిజిస్ట్రేషన్లు చెల్లించవద్దని, టీడీపీ అధికారంలోకి రాగానే ఉచితంగా ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.


Tags:    

Similar News