కక్ష సాధింపు ఇకనైనా ఆపాలన్న లోకేష్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు.

Update: 2021-11-21 07:59 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. కక్ష సాధింపు చర్యలను ఇకనైనా ఆపాలన్నారు. టీడీపీ నేతలను గత రెండున్నరేళ్లుగా వేధించుకుని చంపుకుతింటున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేత కూన రవికుమార్ ను అర్థరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నారా లోకేష్ ప్రశ్నించారు.

ముందు జాగ్రత్త....
కూన రవికుమార్ అరెస్ట్ పై చూపిన శ్రద్ధ వాతావరణ శాఖపై పెట్టాల్సి ఉండేదని నారా లోకేష్ జగన్ కు హితవు పలికారు. వరద తాకిడికి రాష్ట్రం అతలాకుతలమవుతుందన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ప్రాణ, ఆస్తి నష్టం జరిగి ఉండేవి కావని నారాలోకేష్ అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News