ఏనుగుల దాడిలో టీడీపీ నేత మృతి

తిరుపతి జిల్లాలో ఏనుగులదాడిలో టీడీపీ నేత మృతి చెందారు. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన రాకేష్ చౌదరి మరణించారు.

Update: 2025-01-19 04:19 GMT

తిరుపతి జిల్లాలో ఏనుగులదాడిలో టీడీపీ నేత మృతి చెందారు. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన రాకేష్ చౌదరి మరణించారు. ఏనుగుల దాడిలో టీడీపీ నాయకుడు మారుపూరి రాకేష్ చౌదరి మృతి చెందారని పోలీసులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏనుగుల గుంపు వచ్చి రాకేష్ చౌదరిపై దాడి చేయడంతోనే మరణించాడని పోలీసులు పేర్కొన్నారు.

చంద్రబాబుకు సన్నిహితుడిగా...
రాకేష్ చౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితులు అని గ్రామస్థులు చెబుతున్నారు. చిన్న వయసు నుండి పార్టీ కి కష్టపడి పని చేసి నారావారిపల్లె ఉపసర్పంచ్ గా, మరియు చంద్రగిరి మండలం ఐ టి డి పి అధ్యక్షులు గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాకేష్ చౌదరి మరణంతో కీలక నేతను టీడీపీ కోల్పోయినట్లయిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.


Tags:    

Similar News