జగన్ రెడ్డీ ఈ ఆంక్షలేమిటి?
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అభద్రతతో ఉన్నారని ఆయన అన్నారు. జగన్ పాల్గొనే సభల్లో ఇలా ఆంక్షలు పెట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. పరదాలు, బ్యారికేడ్లు పెట్టి పర్యటనకు వెళుతున్న ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
జగన్ సభలకు...
తాజాగా జగన్ సభలకు వచ్చే మహిళ చున్నీలను కూడా తీసివేయించడం దారుణమని ఆయన అన్నారు. బురఖాలు ధరించిన ముస్లిం మహిళలను సభలకు రానిస్తారా? లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. చివరకు గొడుగులు చూసి కూడా జగన్ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఇది పోలీసు భద్రత కాదని, జగన్ అభద్రత అని ఆయన కామెంట్ చేశారు.