జగన్ పని అయిపోయింది : చంద్రబాబు

ఉగాది పంచాగాన్ని ప్రజలు రెండు రోజుల ముందే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలద్వారా చెప్పారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

Update: 2023-03-19 08:16 GMT

ఉగాది పంచాగాన్ని ప్రజలు రెండు రోజుల ముందే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలద్వారా చెప్పారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పులివెందుల్లోనే తిరుగుబాటు మొదలయిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రజల తిరుగుబాటుగా చూడాలన్నారు. తోటివాళ్లను నేరాల్లో భాగస్వామ్యం చేయడం జగన్ నైజం అని ఆయన అన్నారు. అన్ని వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేశాడని అన్నారు. ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతను చాటారన్నారు. ప్రజలు ధైర్యంగా వచ్చి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని అన్నారు.

పులివెందుల్లోనే తిరుగుబాటు...
అధికారులు జగన్ మాట విని జైలుకు పోవద్దని చంద్రబాబు హెచ్చరించారు. కరడు గట్టిన నేరగాడు జగన్ ట్రాప్ లో పడొద్దని పోలీసులకు సూచించారు. కొందరు పోలీసులు ఇష్టం లేని పనులు చేస్తున్నారన్నారు. పోలీసులు కూడా తిరుగుబాటుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. చాలా ఎన్నికలను చూశానని, నిద్రలేని రాత్రులు ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చూశానని అన్నారు. అభ్యర్థులకు డిక్లరేషన్ ఇచ్చేంత వరకూ టెన్షన్ పెట్టారని, ఇది పైశాచికానందం కాకుంటే మరొకటి ఏంటని ప్రశ్నించారు. పులివెందుల వాడయిన రాంభూపాల్ రెడ్డి గెలిపించారని జీర్ణించుకోలేకపోతున్నావా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అహంకారమే పతనానికి నాంది అని, జగన్ పని అయిపోయిందని చంద్రబాబు అన్నారు.


Tags:    

Similar News