జగన్ కు చప్పట్లు కొట్టకుంటే.. అవి కట్

జగన్ కు చప్పట్లు కొట్టకపోతే పింఛన్లు కట్ అవుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

Update: 2022-12-02 07:47 GMT

జగన్ కు చప్పట్లు కొట్టకపోతే పింఛన్లు కట్ అవుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాత్కాలిక ప్రలోభాలకు లొంగిపోవద్దని సూచించారు. ప్రతి ఒక్క ఇంటికి వచ్చిన లాభమెంత? భారమెంత? అనేది బేరీజు వేసుకోవాలన్నారు. మహిళలు ఈసారి తనకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. కొవ్వూరులో మహిళ సంఘాల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. భవిష్యత్ లో మహిళలకు టీడీపీ ఏం చేయబోతుందన్న దానిపై తాను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు. యాభై శాతం మంది ఉన్న మహిళలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చంద్రబాబు అన్నారు. పురుషులకంటే మహిళలకు ఎక్కువ తెలివితేటలున్నాయని సైకాలజిస్టులు చెబుతున్నారన్నారు.

డ్వాక్రా ఆలోచనను...
డ్వాక్రా ఆలోచనను తానే మొదలు పెట్టానని అన్నారు. లక్షల మందిని నైపుణ్యంగా తయారు చేసిన ఘనత టీడీపీది అని ఆయన అన్నారు. ఇళ్లలో వంటకే పరిమితమయిన మహిళలను మగవారికంటే సమర్థవంతంగా పనిచేయగలిగిలే చేశానని చంద్రబాబు తెలిపారు. దీపం పథకం పెట్టి కట్టెల పొయ్యి నుంచి విముక్తి కల్పించి గ్యాస్ కనెక్షన్లను ఇప్పించానని చంద్రబాబు తెలిపారు. ఆరోజు నుంచి మర్చిపోతే ఎలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని ఇచ్చానన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం మరుగుదొడ్డిపై కూడా పన్ను వేశారన్నారు. ఉద్యోగాల్లో, కళాశాలల్లో యువతులకు 33 శాతం రిజర్వేషన్లను కూడా కల్పించిన ఘనత తమదేనని చెప్పారు. మహిళలకు ఎంతో కొంత చేశానన్న తృప్తి ఉందన్నారు. జగన్ మీటింగ్ లకు మాత్రం డ్వాక్రా సంఘాలను వాడుకుంటున్నారని అన్నారు.


Tags:    

Similar News