మాకు చేతకాదా? నువ్వే మగాడివనుకుంటున్నావా?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టే వరకూ నిద్రపోం అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మెడికల్ కళాశాలలు పెట్టకుంటే నీ హయాంలో పెట్టావా? అని ప్రశ్నించారు. మాకు చేతకాదా? నువ్వే మగాడివా? అని ప్రశ్నించారు. అడ్డంగా మాట్లాడి అసెంబ్లీలో జగన్ అడ్డంగా దొరికిపోతున్నారని అన్నారు. ఒక ఇల్లు కట్టలేదు.. ఒక ప్రాజెక్టును నిర్మించలేదని జగన్ పై ఫైర్ అయ్యారు. పిచ్చి పనులతో తుగ్గక్ పనులు చేస్తున్నాడని చంద్రబాబు మండి పడ్డారు. టీడీపీ బీసీ విభాగం, బీసీ సాధికార కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు.
ఇంకొక అవకాశం...
ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం రాబోయే ఇరవై ఐదేళ్ల కోసం, భావితరాల కోసం తనకు ఒక అవకాశమివ్వాలని చంద్రబాబు కోరారు. తాను అనుకుంటే కడపకు రాజశేఖర్ రెడ్డి పేరును తీసేవాడిని కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రిబ్బన్ కటింగ్ చేస్తాడు.. రంగులు మారుస్తాడు అని జగన్ ను ఎద్దేవా చేశారు. జిల్లాకు మెడికల్ కళాశాల పెట్టిన ఘనత టీడీపీదేనని అన్నారు. అమరావతి పూర్తయి ఉంటే యువతకు అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరికేవని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీ సుభిక్షంగా ఉండేదని ఆయన తెలిపారు. బీసీలందరూ పార్టీకి అండగా నిలబడాలని ఆయన కోరారు.