ఏపీలో దారుణం.. చిన్నారిపై వీధికుక్కల దాడి

విజయవాడలోని వన్ టౌన్ వాగు సెంటర్ ప్రాంతంలో 48వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ ఇంటికి సమీపంలో ఈ ఘటన జరిగింది.

Update: 2023-06-06 11:58 GMT

stray dogs attack in vijayawada

వీధికుక్కల దారుణాలు ఆగట్లేదు. తాజాగా విజయవాడలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. ఓ చిన్నారిపై మూడు వీధికుక్కలు దాడి చేశాయి. విజయవాడలోని వన్ టౌన్ వాగు సెంటర్ ప్రాంతంలో 48వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ ఇంటికి సమీపంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలిక మేఘనపై మూడువీధికుక్కలు దాడికి తెగబడ్డాయి. నలువైపుల నుండి దాడి చేసి బాలికను తీవ్రంగా గాయపరిచాయి. బాలిక అరుపులు విన్న స్థానికులు రాళ్లు విసిరి కుక్కలను తరిమికొట్టారు.

వెంటనే బాలికను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స చేస్తున్నారు. కొన్ని నెలలుగా వీధికుక్కల దాడులు జరుగుతున్నాయని, కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో అవి రోజురోజుకీ పెరుగుతున్నాయని స్థానికులు వాపోయారు. వీధి కుక్కలను నియంత్రించడంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. కుక్కల దాడుల్లో ప్రాణాలు పోతే తప్ప అధికారుల నుండి స్పందన రాదేమో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు కళ్లుతెరచి వీధికుక్కలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు.


Tags:    

Similar News