Kasibugga Stampade : మృతి చెందిన తొమ్మిది మంది వీరే

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన తొమ్మిది మందిని గుర్తించారు

Update: 2025-11-01 13:06 GMT

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన తొమ్మిది మందిని గుర్తించారు. ఈ ఘటనలో ముప్ఫయి మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆ ఆలయానికి అనుమతులు కూడా లేవని జిల్లా ఎస్పీ తెలిపారు. తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి చెప్పారు. మృతుల్లో టెక్కలికి చెందిన వారు ఇద్దరు, వజ్రపు కొత్తూరు చెందిన ఒకరు, మందపు వలసకు చెందిన ఇద్దరు, నందిగాం, పలాస కు చెందిన వారు కూడా ఉన్నారు.

ఎక్కువ మంది మహిళలే...
మృతి చెందిన వారిలో రామేశ్వరానికి చెందిన ఏదూరి చిన్నమ్మి, దుక్కవాని పేటకు చెందిన మురిపించి నీలమ్మ, చెలుపటియాకు చెందిన దువ్వు రాజేశ్వరి, శిరాంపురానికి చెందిన యశోదమ్మ, గుడిభద్రకు చెందిన రూప, పలాసకు చెందిన డోక్కర అమ్లు, బెంకిలికి చెందిన నిఖిల్, మందసకు చెందిన బృందావతిలుఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అక్కడ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మంత్రి నారాలోకేశ్ ఘటన స్థలికి బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన పలాస చేరుకోనున్నారు.


Tags:    

Similar News