Kasibugga Stampade : Kasibugga Stampade : ఆలయాలకు వెళ్లాలంటే భయమేనా? క్షణాల్లోనే జరిగిపోవడంతో?

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన తొమ్మిది మంది ఇప్పటి వరకూ మరణించారు

Update: 2025-11-01 13:31 GMT

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన తొమ్మిది మంది ఇప్పటి వరకూ మరణించారు. ఇలాంటి ప్రమాదం జరగడం నిజంగా దురదృష్టకరమే. అయితే ప్రభుత్వం మాత్రం అది తమ పరిధిలోది కాదని, తమకు సమాచారం లేదని పోలీసులు చెబుతుండటమే కొంత ఇబ్బందికరంగా మారింది. ప్రతి విషయాన్ని పోలీసులు నిశితంగా చూస్తుంటారు. తమ ప్రాంతంలో జరుగుతున్న అనేక ఘటనలపై ఆరా తీస్తుంటారు. వారికి ఇంటలిజెన్స్ వ్యవస్థ కూడా ఉంది. నిజమే.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన ఘటనకు ఆలయ నిర్వాహకులదే బాధ్యత.అంత మాత్రాన ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేయడమేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నేతలు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పల రాజులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

సమాచారం ఇచ్చి ఉంటే...
ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తూ ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఉండేవారమని అన్నారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన కూడా ఇలాగే తప్పించుకున్నారా? నాడు ముందే తెలిసినా అధికారులు విఫలమయ్యారు కదా? అది ప్రభుత్వం ఫెయిల్ కాదా? అని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు జారీ చేసే కౌంటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించిన దానిపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. న్యాయ విచారణ జరిపి చర్యలు కొందరిపైనే తీసుకుని తూతూ మంత్రంగా ముగించారని విమర్శించారు.
సింహాచలంలో జరిగిన...
ఇక సింహాద్రి అప్పన్నచందనోత్సవం సందర్భంగా కూడా జరిగిన గోడ కూలిన ఘటనపై తప్పు ఎవరిది అని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మరణించారని, దానికి బాధ్యులు పాలకులు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. మంత్రులు పదే పదే సమీక్షలు అక్కడ నిర్వహించినా దుర్ఘటన దురదృష్టకరమంటూ కొట్టిపారేశారని, ఇప్పుడు తాజాగా కాశీబుగ్గలో జరిగిన ఘటనకు ఆలయ నిర్వాహకులదే తప్పు అయినా అక్కడ జరుగుతున్న విషయాలను తెలియకపోవడం అధికారుల తప్పు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. అది తమ పరిధిలో లేదని దేవాదాయ శాఖ తప్పించుకోవడం సరికాదంటూ వైసీపీ నేతలు అంటున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




















Tags:    

Similar News