ఏపీ లిక్కర్ స్కామ్ లో భారీగా ఆస్తులు సీజ్
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో భారీగా ఆస్తులు, నగదు సిట్ స్వాధీనం చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో భారీగా ఆస్తులు, నగదు సిట్ స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు 116.63 కోట్ల రూపాయలు విలువచేసే ఆస్తులు, నగదు సీజ్ సిట్ చేసింది. నిందితులకు చెందిన బ్యాంక్ అకౌంట్లలోని నగదును ఫ్రీజ్ చేసిన సిట్ అధికారులు 8.36 కోట్ల విలవు చేసే స్థిరాస్థులకు సిట్ అటాచ్ మెంట్ జారీ చేసింది.
రాజ్ కేసిరెడ్డికి చెందిన...
డిస్టలరీలు, నిందితుల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 57.48 కోట్ల రూపాయలను కూడా సిట్ అధికారులు ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డి కి చెందిన 30 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేసిన సిట్ అధికారులు రాజ్ కేసిరెడ్డికి చెందిన ఈప్నవి ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు చెందిన 9.78 కోట్ల రూపాయలు విలువ చేసే స్థిరాస్తులను కూడా అటాచ్ చేసింది. ఇటీవల హైదరాబాద్ ఫామ్ హౌస్‌లోని 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు సంగతి తెలిసిందే.