నేడు లిక్కర్ స్కామ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్న సిట్

మద్యం కేసులో స్పెషల్ ఇన్విస్టేగేషన్ టీం అధికారులు నేడు ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది

Update: 2025-07-19 06:01 GMT

మద్యం కేసులో స్పెషల్ ఇన్విస్టేగేషన్ టీం అధికారులు నేడు ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఛార్జిషీట్ లో ఏ అంశాలను పేర్కొంటారన్న దానిపై చర్చజరుగుతుంది. దాదాపు మూడు వేల కోట్లకు పైగా ఏపీ లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పదకొండు మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు.

అరెస్టయి తొంభయి రోజులు...
అరెస్టయి తొంభయి రోజులు కావస్తుండటంతో ఈరోజు స్పెషల్ ఇన్విస్టేగేషన్ టీం అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 22వ తేదీతో రాజ్ కేసిరెడ్డిని ఏ1 నిందితుడిగా చేర్చడంతో పాటు అరెస్ట్ చేసి 90 రోజులు కావస్తుండటంతో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ4 నిందితుడిగా మిధున్ రెడ్డి ఉన్నారు.


Tags:    

Similar News