Andhra Pradesh Liqur Scam : ఏపీ లిక్కర్ కేసులో నేడు సిట్ అడిషనల్ ఛార్జి షీట్
ఏపీ లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నేడు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు అడిషనల్ చార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది
ఏపీ లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నేడు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు అడిషనల్ చార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలిసింది. ధనుంజయ, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్ప పాత్రపై అడిషనల్ చార్జ్‌షీట్‌లో సిట్ అధికారుల ప్రస్తావించే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే తెరపైకి రూ. 11 కోట్ల సీజ్ వ్యవహారం స్కాం ను కుదిపేస్తుంది.
ఎవరి పేర్లుంటాయో?
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో జూలై19న ప్రిలిమినరీ చార్జ్‌షీట్ ను స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు దాఖలు చేశారు. అయితే అడిషనల్ చార్జ్‌షీట్‌లో ప్రస్తావించేఅంశాలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరి పేర్లు అడిషనల్ ఛార్జిషీట్ లో ఉంటాయన్న దానిపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.