యుద్ధభూమిలో ఏపీకి చెందిన వీర జవాన్ మృతి

జమ్మూకాశ్మీర్ లో జరుగుతున్న యుద్ధభూమిలో ఆంధ్రప్రదేశ్ చెందిన వీరజవాన్ మరణించారు.

Update: 2025-05-09 07:25 GMT

భారత్ - పాకిస్తాన్ లమధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే జమ్మూకాశ్మీర్ లో జరుగుతున్న యుద్ధభూమిలో ఆంధ్రప్రదేశ్ చెందిన వీరజవాన్ మరణించారు. మురళీ నాయక్ మరణించడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. అనంతపురం జిల్లా గోరంట్ల మండలానికి చెందిన మురళీనాయక్ ఆర్మీలో పనిచేస్తున్నారు.

ఏపీకి చెందిన...

మురళి నాయక్ స్వస్థలం గోరంట్ల మండలం గడ్డం తాండ పంచాయతీ కల్లితండ గ్రామం. మురళీనాయక్ సోమందేవిపల్లి మండలం నాగినాయని చెర్వు తండాలో పెరిగారు.అక్కడే పాఠశాలలో చదువుకుని ఆర్మీలో చేరాడు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన యుద్ధభూమిలో మరణించిన మురళీ నాయక్ మృతదేహం రేపు స్వగ్రామనికి చేరుకునే అవకాశముంది.


Tags:    

Similar News