విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేపు సిట్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో కోరారు. ఇప్పటికే ఒకసారి విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే కీలకమైన నిందితులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
నేడు రజత్ భార్గవ్ కు...
ఇప్పుడు మరోసారి విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడంతో మరింత సమాచారాన్నిఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో రాబట్టేందుకు విజయసాయిరెడ్డిని విచారణకు రావాల్సిందిగా కోరింది. ఈరోజు మాజీ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ సిట్ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో నేడు విచారించే అవకాశముంది.