శిద్ధా రాఘవరావు చేరికను అడ్డుకున్నదెవరో తెలిస్తే?

మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నారు. అయితే ఆయన చేరికకు మాత్రం గ్రీన్ సిగ్నల్ దొరకలేదని తెలిసింది

Update: 2025-09-30 07:59 GMT

మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నారు. అయితే ఆయన చేరికకు మాత్రం గ్రీన్ సిగ్నల్ దొరకలేదని తెలిసింది. అందుకే శిద్ధా రాఘవరావు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. శిద్ధా రాఘవరావు ప్రస్తుతం తన వ్యాపారాలకే పరిమితమయ్యారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ సంస్థల వ్యాపారాన్నినిర్వహిస్తూ ఆయన సమయాన్ని గడుపుతున్నారు. అదే సమయంలో తన సామాజికవర్గానికి చెందిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతే తప్ప రాజకీయ కార్యక్రమాల్లో మాత్రం ఆయన పాల్గొనడం లేదు. ఆయన ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో పాటు వైశ్య సామాజికవర్గానికి చెందిననేత కావడంతో సహజంగా రాజకీయ పార్టీలు ఆయన చేరికకు స్వాగతం చెబుతాయి.

మంత్రిగా పనిచేసినా...
2014 ఎన్నికల్లో శిద్ధా రాఘవరావు దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఐదేళ్ల పాటు శిద్ధా రాఘవరావు మంత్రిగా ఉన్నారు. తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తర్వాత శిద్ధారాఘవరావుకు చెందిన గ్రానైట్ కంపెనీలపై భారీగా జరిమానాలను విధించింది. దీంతో శిద్ధా రాఘవరావు కుటుంబం టీడీపీని వదిలి పెట్టి వైసీపీలో చేరింది. వైసీపీలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినప్పటికీ శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరడంతో మొన్నటి ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి గొట్టిపాటి కుటుంబానికి చెందిన గొట్టిపాటి లక్ష్మికి చంద్రబాబు సీటు కేటాయించారు.
వైసీపీకిరాజీనామా చేసి...
వైసీపీలో సీటు దక్కలేదు. దీంతో శిద్ధా రాఘవరావును ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయించాలని చూసినా కుదరలేదు. ఇక 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిద్ధా రాఘవరావు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఒక దశలో చంద్రబాబు నాయుడును కలిసి తిరిగి టీడీపీలో చేరాలని భావించినా అందుకు కీలక నేత ఒకరు అంగీకరించలేదని సమాచారం. వైసీపీకి రాజీనామా చేశారు. శిద్ధా రాఘవరావు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైశ్య సామాజికవర్గం కార్యక్రమాల్లోనే ఆయన పాల్గొంటున్నారు. దీంతో పాటు కూటమి ప్రభుత్వంలోని నేతలతో ఆయన టచ్ లో ఉంటున్నారని, అయితే ఆయన చేరిక మాత్రం ఇప్పట్లో ఉండదని మాత్రంచెబుతున్నారు. మొత్తం మీదశిద్ధా రాఘవరావు ఇప్పుడు ఏ పార్టీలో లేకుండా ఆయన తన పని తాను చూసుకుంటున్నారు.
Tags:    

Similar News