ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ప్రొటెం స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు
tdp mla gorantla butchaiah chaudhary
ఈ నెల 21న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాలకు ప్రొటెం స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసి ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించాలని కోరారు. అందుకు బుచ్చయ్య చౌదరి అంగీకరించారు.
పయ్యావుల ఫోన్...
రేపు ప్రొట్రెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించను్నారు. ఈ నెల 21న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మాత్రమే ఉంటుంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆయనను ప్రొటెం స్పీకర్ గా నియమించాలని నిర్ణయించారు.