విజయవాడ ఆసుపత్రికి పీఎస్‌ఆర్ ఆంజనేయులు
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులకు అస్వస్థతకు గురయ్యారు
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులకు అస్వస్థతకు గురయ్యారు. ఆయన హైబీపీతో బాధపడుతున్నారు. దీంతో వెంటనే జైలు అధికారులువిజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముంబయి నటి వేధింపుల కేసులో పీఎస్‌ఆర్ ఆంజనేయులును తొలుత పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీపీఎస్సీ కేసులో...
అయితే ఆయనపై ఏపీపీఎస్సీ పరీక్ష పత్రాలు దిద్దడంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మరో కేసు నమోదయింది. ముంబయి నటి వేధింపుల కేసులో బెయిల్ వచ్చినా ఏపీపీఎస్సీ కేసులో మాత్రం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పీఎస్‌ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురి కావడంతో ఆయనను విజయవాడ ఆసుపత్రికి తీసుకు వచ్చారు.