టీటీడీపై న్యాయస్థానం ఆశ్రయిస్తా : సుబ్రహ్మణ్యస్వామి

తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో ఆవుల మృతి ఆరోపణలపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2025-04-18 07:56 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో ఆవుల మృతి ఆరోపణలపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవుల మృతిపై త్వరలోనే తాను న్యాయస్థానంలో పిటీషన్ వేస్తానని సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు. రాజ్యాంగంలో గోవులకు అత్యంత స్థానం కల్పించారని, కోట్ల మంది ఆరాధ్యదైవమైన తిరుమల సన్నిధిలో గోవుల ఆలనా పాలనా పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు.

గోవులను వదిలేస్తున్నారని...
గోవులను వదిలేస్తున్నారని, గోవుల మరణాలపై టీటీడీ అసత్యాలు చెబుతుందని అన్నారు. గోవుల మరణంపై సమగ్ర విచారణ కోరుతూ తాను త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. గోవుల మరణాలు తనను కలచి వేశాయన్నసుబ్రహ్మణ్యస్వామి దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.


Tags:    

Similar News