Andhra Pradesh : నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

Update: 2025-10-30 03:57 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. మొంథా తుపాను ప్రభావం తగ్గడంతో అన్ని జిల్లాల్లో విద్యాసంస్థలు తెరవాలని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. తుపాన్ ప్రభావం తగ్గడం వలన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలోని అన్ని పాఠశాలలు ఈ నెల 30 నుంచి యధావిధిగా పూర్తిస్థాయిలో నిర్వహించాలని అధికారులు ఆదేశించారు.

తుపాను ప్రభావం తగ్గడంతో...
తుపాను పునరావాస కేంద్రం నిర్వహణ కోసం పాఠశాల ఆవరణ కేటాయించిన సందర్భం లో సదరు సచివాలయ / పంచాయతీ / మునిసిపల్ అధికారుల సహకరముతో పారిశుద్ధ్య నిర్వహణ చేసి పాఠశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలలు పునః ప్రారంభం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల పరిసరాలలో ఎక్కడైనా పాత భవనాలు / శిధిలావస్దలో ఉన్న భవనాలు / వర్షపు నీరు లీక్ అయ్యే భవనాలు ఉన్నట్లయితే వాటి పరిసరాలలోనికి విద్యార్ధులు ఎవ్వరూ వెళ్లకుండా చూసుకోవాలని కోరారు.


Tags:    

Similar News