సనాతన ధర్మం రక్షణ అంటే ఇదీ.. మాటలు కాదు చేతల్లో యూట్యూబర్లు

యూట్యూబర్లు కేవలం తమ సొంత ప్రయోజనాలే కాదు.. సామాజిక సమస్యలకు కూడా చెక్ పెడుతున్నారు

Update: 2026-02-17 04:34 GMT

యూట్యూబర్లు కేవలం తమ సొంత ప్రయోజనాలే కాదు.. సామాజిక సమస్యలకు కూడా చెక్ పెడుతున్నారు. సనాతన ధర్మానికి సత్తువ కోసం నడుంబిగించారు. మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. కేవలం రీల్స్ చేసి వ్యూస్ పెంచుకునే పని చేయకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ అభినందనలను అందుకుంటున్నారు. నేను సైతం అంటూ పురాతన ఆలయాల్లో పాడుపడిపోయిన కోనేరులు, పూర్వీకులు తమకు అందించిన వాటికి తిరిగి ఒక రూపం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో లలో యూట్యూబర్లు ఈ ప్రయత్నాన్ని అందరూ హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ సహకారాన్ని అందిస్తున్నారు. ప్రధానంగా పురాతన ఆలయాల్లో ఉన్న కోనేరులు, పాడు పడిన బావులను పునరుద్ధరించే కార్యక్రమాన్ని శ్రమదానంతోనూ, జేసీబీలతోనూ చేసి వాటి రూపు రేఖలు మారుస్తున్నారు.

కల్వకుర్తి గచ్చుబావిని...
తెలంగాణలోని కల్వకుర్తి గచ్చుబావిని గత యాభై రోజులుగా శ్రమించి దాదాపుగా పనులను ఒక కొలిక్కి తెచ్చారు. ఇందుకోసం బాబీదేవ్ గంగోంజ్ ఇచ్చిన పిలుపునకు స్థానికుల నుంచి మంచి స్పందన రావడంతో గచ్చుబావి దాదాపు పూర్తయింది. సనాతన ధర్మం కోసం గచ్చుబావిని రక్షించుకుందామని ఇచ్చిన పిలుపునకు పదుల సంఖ్యలో యువకులు స్పందించారు. అలాగే కొందరు శ్రమదానం చేయలేని వారు యంత్రాలను ఉపయోగించేుకునేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అంద చేశారు. కడప జిల్లా కు చెందిన కడప బాల నాగిరెడ్డి అనే ఇన్ ఫ్లూయర్ ఇచ్చిన పిలుపుతో ఒక కోనేరు శుభ్రం చేశారు. నా ఊరు.. నా మండలం.. నా జిల్లాా అనుకుని వందల మంది ఏకమయ్యారు
నంద్యాల జిల్లాలోని కోనేరును...
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆర్ కృష్ణాపురం గ్రామంలో ఉన్న కోనేరు పాడు పడిపోయింది. దానిని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. పాడుబడిన కోనేరులో బాటిళ్లు, ప్లాస్టిక్ వస్తువులు వేసి ధ్వంసమవుతున్న కడప బాల నాగిరెడ్డి ఈ కోనేరు దుస్థితిని చూసి కోనేరును కాపాడుకుందాం అని ఒకే పిలుపుతో రెండు వందల మంది స్పందించారు. దానిని ఒక కొలిక్కి తెచ్చారు. పవిత్రమైన కోనేరు కాలగర్భంలో కలసి పోకుండా కోనేరును పునరుద్ధరించారు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభమైన పనులు పూర్తయ్యాయి. కోనేరు ను తిరిగి పునరుద్ధరించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోనేరును పునరుద్ధరించడానికి వందలాది మంది రావడంతో సులువుగా దానికి కొత్త రూపు తెచ్చారు. మన గుడి - మన బడి పేరుతో యూట్యూబర్లు.. ఇన్ ఫ్యూయెన్సర్లు చేస్తున్న కృషిని మనమూ ప్రశంసించడమే కాదు.. చేయూతనందించి సహకరిద్దాం.


Tags:    

Similar News