తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. సూర్యగ్రహణం తర్వాత రోజు కావడంతో భక్తుల రద్దీ కొంత మేర తగ్గిందనే చెప్పాలి

Update: 2022-10-26 02:28 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. సూర్యగ్రహణం తర్వాత రోజు కావడంతో భక్తుల రద్దీ కొంత మేర తగ్గిందనే చెప్పాలి. నిన్నటి వరకూ భక్తుల రద్దీగా ఉన్న తిరుమల ఈరోజు మాత్రం భక్తుల సంఖ్య సాధారణంగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి స్వామి వారి దర్శనం కేవలం నాలుగు గంటలు మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

త్వరగా దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి గంట నుంచి రెండు గంటలలోపు దర్శనం లభిస్తుందని చెప్పారు. నిన్న తిరుమల శ్రీవారిని 25,549 మంది భక్తులు దర్శించుకున్నారు. 9,764 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.


Tags:    

Similar News