రష్ కంటిన్యూ.. పండగైనా సరే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 24 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు
tirumala special entry darshan tickets for december
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్ లో భక్తులకు స్వామి వారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇప్పటికిప్పుడు సర్వదర్శనం క్యూలైన్ లోకి వచ్చే వారికి అదనంగా మరికొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి దర్శన సమయం మూడు నుంచి నాలుగు గంటల వరకూ సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిి 76,307 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,573 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.41 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.