Road Accident : ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్లలో ఈ ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సును కారు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం నంద్యాల వెళు వెళుతున్న క్వాలిస్ వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. డివైడర్ ను ఢీకొట్టి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది.
డివైడర్ ను ఢీకొని...
బస్సు కడప వైపునకు వెళుతుంది. ఈ ప్రమాదంలో క్వాలిస్ లో ఉన్న ప్రయాణికులు నలుగురు అక్కడికక్కడే మరణించారు. వాహనం నుజ్జునుజ్జు అయింది. అతి వేగమే ప్రమాదానికి గల కారణాలని పోలీసులు తెలిపారు. పొగమంచు కూడా ఒక కరాణం కావచ్చని పోలీసులు చెబుతున్నారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.