Ys Jagan : పులివెందుల సీఎస్ఐ చర్చిలో జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పులివెందులలో జరిగిన వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలసి జగన్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరూ కలసి ప్రత్యేక ప్రార్ధనలను స్థానికులతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.
విజయమ్మతో కలసి...
మూడు రోజుల క్రితం పులివెందులకు చేరుకున్న జగన్ ప్రజాదర్బార్ లో కూడా పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈరోజు జగన్ తో పాటు తల్లి విజయమ్మ కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం జగన్ బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. వైఎస్ జగన్ సీఎస్ఐ చర్చికి వచ్చిన సందర్భంగా పెద్దయెత్తున పార్టీ కార్యకర్తలు రావడంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.